Sunday, 11 November 2012

సుప్రభాతం(2008)


నమ్మిన వారికి కొంగు బంగారం
మమ్మల్ని నమ్ముకుంటే నీ బంగారం మాయం 
మేము ఏరు దాటాక తెప్ప తగలేసే వాళ్ళం
నామాల వాడికే పంగనామాలు పెట్టే ఘనులం
నీకు కూడా తెలుసు ...
మా మాయాజాలం 
మెట్టు మెట్టుకి కోరికల అష్ఠోత్రం
తీరిస్తే??? వస్తా!!!
అని నీకు పెట్టే పరిక్షా కాలం 
తిరుస్తాడా? అని నీ  పైనే అనుమానం

నిన్ను నమ్ముకున్న ప్రజలని దోచుకొని
ని హుండిలో వేసేస్తాం సగం
అమాయకంగా కురిపిస్తావు..
మాపై కరుణారసం
ఎందుకయ్యా ఇంతటి అమాయకత్వం 
మేలుకో..
విని సుప్రభాతం
పూరించు శంఖారావం
ధుష్ట శిక్షణకు వినియోగించు నీ చక్రం 
ఖండించు ఈ  ధురాగతం
    (తిరుపతి వేంకటేశ్వర స్వామి బంగారు డాలర్లు పొఇన దానికి నిరసనగా)

Thursday, 8 November 2012

ఏదో భయం(June 2008)


ఏదో భయం..
మోయగలనా భారమైన
తియ్యటి బంధాన్ని అని

ఇన్నాళ్ళూ..
పెళ్ళి కావాలంటూ
గొడవ చేసిన నేనెనా అన్న అనుమానం

ఒక్కసారిగా..
శతమర్కటం తోక మాయం
ఇష్టమైన కష్టం 
వూడిపడిన పెద్దరికం

ఒరై ...
వీడు బలైపోయాడురా!!!
అంకుల్ గాడు 
అంటు..
స్నేహితుల చిలిపి వేళాకోళం

కొత్త అమ్మాయి అంటే
ఇష్టమైన బిడియం
జీవితంలో కొత్త శకం 
ఇంతేనా పెళ్ళి అంటే ???

నా మొదటి కవిత(1998)


ఎదేది జాతియత
ఎటు చూసిన విజాతీయత
ముక్క ముక్కలు చెక్క చెక్కలు
మూఢ నమ్మకాల నాదేశం
నక్సల్స్ కాదు నా దేశ ద్రోహులు
కుల మత భేధాలు నా దేశ కౄర మృగాలు